National

Gas booking: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రీఫిల్ బుకింగ్‌లో కీలక మార్పులు!..

గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ 25 రోజులకే ఎల్‌పీజీ సిలిండర్‌ రీఫిల్‌ బుక్‌ చేసుకోవచ్చు. గతంలో సరఫరాపై ఒత్తిడి కారణంగా గ్రామాల్లో 45 రోజుల పరిమితి విధించడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో ఆ ఆంక్షలను కేంద్రం సడలించింది. ఇక పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో 25 రోజులకే రీఫిల్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించింది.