తెలంగాణ

Garika Puja: గరిక పూజతో వినాయకుడు ఎందుకు ప్రసన్నుడవుతాడు? అసలు రహస్యమిదే!

Garika Puja: హిందూ సంప్రదాయంలో విఘ్నాధిపతి అయిన వినాయకుడి పూజకు విశిష్టమైన స్థానం ఉంది. వినాయక చవితి లేదా నిత్య పూజల్లో మాచీ పత్రం, బృహతీ పత్రం, దత్తూర పత్రం, అర్క పత్రం వంటి 21 రకాల దివ్య ఔషధ గుణాలు కలిగిన 'ఏకవింశతి పత్రాల'తో స్వామిని ఆరాధిస్తాం. ఎన్ని రకాల సుగంధ పుష్పాలు, విశేష పత్రాలు సమర్పించినప్పటికీ.. చివరకు గడ్డి జాతికి చెందిన చిన్న 'గరిక' లేకపోతే గణపతి పూజ అసంపూర్ణంగానే భావిస్తారు. అసలు సాక్షాత్తు దేవదేవుళ్లందరూ చేయలేని ఉపశమనాన్ని కేవలం గరిక మాత్రమే ఎలా ఇవ్వగలిగింది? గరిక పూజ వెనుక దాగి ఉన్న పురాణ రహస్యం ఏమిటి? ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.పురాణాల ప్రకారం పూర్వం 'అనలాసురుడు' (అనగా అగ్ని స్వరూపుడైన రాక్షసుడు) అనే రాక్షసుడు సమస్త లోకాలను, దేవతలను, మునులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవాడు. అతని అరాచకాల నుంచి కాపాడాలని దేవతలంతా వెళ్లి విఘ్నేశ్వరుడిని శరణు వేడారు. అప్పుడు లోక రక్షణ కోసం ఆ విఘ్ననాయకుడు ఏకంగా ఆ రాక్షసుడిని అమాంతం మింగివేశాడు. అయితే, అగ్ని తత్వమున్న రాక్షసుడిని మింగిన తర్వాత వినాయకుడి ఉదరంలో, శరీరంలో తీవ్రమైన మంటలు, విపరీతమైన వేడి పుట్టుకొచ్చాయి. ఆ వేడిని తగ్గించడానికి దేవతలంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.