తెలంగాణ
విగ్రహ ప్రతిష్టచేయకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు
వినాయకచవిత పండుగ సందర్భంగా గల్లీగల్లీలో బొజ్జ గణపయ్యలు కొలువుదీరారు. ఘనంగా పూజలు అందుకున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ వినాయకులు ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. తీరొక్క గణపయ్యలు వాడవాడాలా కొలువుదీరడంతో యువత, చిన్నారుల సందడి నెలకొంది.నిన్నటివరకు వరుసగా సెలవులు రావడంతో గణపయ్య మండపాల వద్ద కోలాహలం నెలకొంది.సాయంత్రం వరకు వినాయకులను డప్పుచప్పుళ్లు, ఊరేగింపుల నడుమ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో ప్రతిష్టించారు. అయితే, విగ్రహాన్ని ప్రతిష్టించాక నవరాత్రులు పూర్తయ్యాక గణపతిని గంగమ్మ ఒడికి పంపిస్తారు. అయితే,నగరాల్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడో రోజు నుంచే నిమజ్జనాలు కొనసాగుతాయి. ఇదిలాఉండగా,విగ్రహాన్ని ప్రతిష్టించకుండానే ఓ చోట గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
