తెలంగాణ
గణేశ్ నవరాత్రులు.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్
గణేశ్ నవరాత్రుల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. వేడుకల నిర్వహణ, బందోబస్తు, మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధులు, నిర్వాహకులతో నేరుగా సమీక్షించే సంప్రదాయాన్ని పునరుద్ధరించామన్నారు. నిర్వాహకుల సమస్యలు తెలుసుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. నిర్వాహకులు ముందుగా అధికారులకు దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని కోరారు.
