తెలంగాణ

గణేశ్ నిమజ్జనం.. మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్

వినాయకచవితి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. గణపయ్యను ప్రతిష్టించిన మూడో రోజు నుంచే హైదరాబాద్ మహానగరంలో ఘనంగా నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల నిమజ్జనాలు పూర్తయ్యాయి.. రేపు నగరంలోని ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం జరగనుంది. ఇదిలాఉండగా, నగర వాసులకు హైదరాబాద్ మెట్రో అధికారులు తీపి కబురు అందించారు. శోభాయాత్ర, నిమజ్జనం మహోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మెట్రో రైలు వేళలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 25న అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. నగరంలోని అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.