తెలంగాణ
Gadwal: సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. జమ్మిచేడు వద్ద భారీ ధర్నా!..
సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు.. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు గద్వాల నియోజకవర్గ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జూరాల–నెట్టెంపాడు ఆయకట్టు కింద సాగు చేసిన వరి పంటకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్న జమ్మిచేడు సమీపంలో గద్వాల–కర్నూలు ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. జూరాల ప్రాజెక్టు నుంచి కాలువలకు వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. దాదాపు ఐదు గంటల పాటు కొనసాగిన ఈ నిరసనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
