తెలంగాణ
Gadwal: శ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ.. తెలంగాణ సుభిక్షం కోసం మంత్రి మొక్కులు!..
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. బాల బ్రహ్మేశ్వర స్వామివారిని, జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం తగ్గి, తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతాంగం మంచి దిగుబడులు సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
