క్రైమ్

మార్కెట్ యార్డులోనే మత్తు దందా!..

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. భారీ మొత్తంలో గంజాయి పట్టుబడటంతో.. గద్వాల పట్టణంలో గంజాయి విక్రయాలు, సరఫరాపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల వ్యాపారం జరుగుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.