స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
FutureCityLandGrab: తాండూరు ఎమ్మెల్యే కబ్జాలను వదలొద్దు!
తెలంగాణకు ఫ్యూచర్ సిటీయే ఫ్యూచర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెగ ఊదరగొడుతున్నారు. భారీ పెట్టుబడులు అంటూ ఏ కార్యక్రమానికి వెళ్లినా చెప్పిందే చెబుతున్నారు. అయితే, ఫ్యూచర్ సిటీ చుట్టూ భూ కబ్జాలు భారీగానే జరుగుతున్నాయి. ఏకంగా 51 ఎకరాలపై కన్నేసిన తాండూరు ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులతో కలిసి రికార్డులను తారుమారు చేస్తున్నారు. మొత్తం భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలను స్వేచ్ఛ న్యూస్ గతంలోనే కథనాలను ఇచ్చింది. తాజాగా బాధితులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు లేఖ రాయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.
