తెలంగాణ
ఫ్యూచర్ సిటీ హామీలు అబద్ధం.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు!
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రికి, ఆయన మంత్రివర్గ సహచరులకు మధ్య కనీస సయోధ్య లేదని సచివాలయ వేదికగానే బయటపడిందని ఆయన ఆరోపించారు. సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి కూర్చున్న 10 నిమిషాల తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడం వారి మధ్య ఉన్న తీవ్ర విభేదాలకు అద్దం పడుతోందన్నారు. ఒకే కేబినెట్ సబ్ కమిటీలో ఉండి కూడా మంత్రులు సమయానికి హాజరు కాకపోవడం పాలనా రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
