తెలంగాణ

ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధం.. 1.80లక్షల ఎకరాల్లో నగరాభివృద్ధి!

 తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ (Future City) మాస్టర్ ప్లాన్ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంది. సింగపూర్‌కు చెందిన ప్రఖ్యాత ‘డీపీ ఆర్కిటెక్ట్స్’ (DP Architects) సంస్థ అంతర్జాతీయ ప్రామాణికాలతో ఈ ప్రణాళికను సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శ్రీశైలం, నాగార్జునసాగర్ రహదారుల మధ్య మొత్తం 1.80లక్షల ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ నగరం మాస్టర్ ప్లాన్‌ను త్వరలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించనుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) పరిధిలోని 7 మండలాలు, 71 రెవెన్యూ గ్రామాల సమగ్ర వికాసం లక్ష్యంగా ఈ ప్లాన్ తయారు చేశారు.