తెలంగాణ

FSSAI Raid: కరకరలాడే స్నాక్స్ కావు... కల్తీ విషం!

రంగురంగుల ప్యాకెట్లలో మెరుస్తూ, కొరకగానే కరకరలాడే చప్పుడుతో పిల్లల నాలుకను ఊరించే ఆ చిరుతిళ్లు అమృతం కావు... నిలువెల్లా విషం అని అంటున్నారు అధికారులు. రూపాయి, రెండు రూపాయలకే ప్యాకెట్ నిండా దొరుకుతున్నాయి కదా అని పిల్లల చేతుల్లో పెడుతున్న ఆ స్నాక్స్, వాళ్ల పసి ప్రేవులను నిశ్శబ్దంగా కుళ్లబెడుతున్నాయని తెలిస్తే ఏ తల్లిదండ్రుల గుండెలైనా బద్దలవ్వాల్సిందే. కాసుల కోసం కళ్లుమూసుకున్న కల్తీ ముఠాలు చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతూ సాగిస్తున్న విష దందా హైదరాబాద్ వేదికగా రట్టయింది. కాటేదాన్ సమీపంలోని ప్రేమావతిపేటలో రూల్స్‌ని తుంగలో తొక్కి సాగుతున్న సాహిల్ ఫుడ్స్‌కు చెందిన నాలుగు తయారీ కేంద్రాలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేయడంతో ఈ వికృత రూపం బయటపడింది.