National
FSSAI Plastic Ban: పాన్ మసాలాపై ప్లాస్టిక్ బ్యాన్.. మరి క్యాన్సర్ సంగతేంటి?
దేశంలో విస్తృతంగా విక్రయించే పాన్ మసాలా ప్యాకేజింగ్ విషయంలో కేంద్ర ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాన్ మసాలాలను ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్ లేదా మెటలైజ్డ్ కవర్లలో విక్రయించకూడదని నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా వీటికి బదులుగా కేవలం కాగితం, సెల్యులోజ్, టిన్ లేదా గాజు పాత్రలలో మాత్రమే ప్యాక్ చేయాలని సూచించింది. ఈ ప్రకటనతో పాన్ మసాలాపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేయడంతో తీవ్ర చర్చకు దారితీసింది.
