National

FSSAI: ఫ్రీడమ్ ఆయిల్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు!

FSSAI: ఈ వంటనూనె వాడితే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, గుండె చాలా పదిలంగా ఉంటుంది అంటూ టీవీల్లో, ఆన్‌లైన్‌లో వచ్చే యాడ్స్ చూసి కొంటున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్. ఇలాంటి మాటలు చెప్పి జనాలను మోసం చేస్తున్నారంటూ ప్రముఖ వంటనూనె కంపెనీ ‘ఫ్రీడమ్ కుకింగ్ రైస్ బ్రాన్ ఆయిల్’పై భారత ఆహార భద్రతా సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సీరియస్ అయింది. రూల్స్ పాటించకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆ కంపెనీకి, ఆ నూనెను ఆన్‌లైన్‌లో అమ్ముతున్న సంస్థలకు గట్టి షాక్ ఇచ్చింది.నిబంధనలు గాలికొదిలేసి యాడ్స్ ఇస్తున్న జెమిని ఎడిబుల్స్ కంపెనీతో పాటు, వాటిని ప్రమోట్ చేస్తూ అమ్ముతున్న బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌లకు కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ షోకాజ్ నోటీసులు పంపింది. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని నిలదీసింది.