తెలంగాణ
ప్రియగోల్డ్ బిస్కెట్లలో పశువుల దాణా.. దొడ్ల పాలలో డిటర్జెంట్ : FSSAI
FSSAI: మనం మార్కెట్లో పేరున్న బ్రాండ్లు అని నమ్మి కొనే ఆహార పదార్థాల్లో ఎలాంటి కల్తీ జరుగుతోందో తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ప్రముఖ కంపెనీలైన ప్రియగోల్డ్ బిస్కెట్లు, దొడ్ల పాలల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రియగోల్డ్ బిస్కెట్ల తయారీలో ఏకంగా పశువుల దాణాను వాడుతుండగా, దొడ్ల పాలలో విషపూరిత డిటర్జెంట్ అవశేషాలు ఉన్నట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) గుర్తించింది. రూల్స్ బేఖాతరు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న సూర్య ఫుడ్ అండ్ ఆగ్రో (ప్రియగోల్డ్), దొడ్ల డెయిరీ, యూఈఐఆర్ ఆర్గానిక్ ఫుడ్స్ సంస్థలపై చట్టపరమైన ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
