తెలంగాణ

Freebus: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత బస్సు సౌకర్యం!

తెలంగాణలోని వయోవృద్ధులకు (సీనియర్ సిటిజన్లు) రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వయోవృద్ధులకు కూడా విస్తరించే అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిశీలిస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. వీలైనంత త్వరగా ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.