తెలంగాణ

హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్లు అరెస్టు

హైదరాబాద్ మహానగరంలో మరోసారి మాయాగాళ్లు పోలీసులకు చిక్కారు. నకిలీ క్లినిక్స్ తెరిచి తాము డాక్టర్లం అని చెప్పుకుని వీరంతా రోగులకు చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ఎలాంటి విద్యార్హత లేకుండా వైద్యం చేస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో రంగంలోకి దిగి వారిని పట్టుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్ కావడం హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి వైద్య అర్హతలు, కనీసం ప్రాక్టిస్ చేసిన ధ్రువపత్రాలు కూడా లేకుండా వీరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు తెలిసింది. నకిలీ డాక్టర్ల ముఠాను సిటీ పోలీసులు పట్టుకోవడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. నగరంలోని పలు ఏరియాల్లో వీరంతా గుట్టుగా క్లినిక్స్ రన్ చేస్తున్నట్టు సమాచారం.