క్రైమ్

పెళ్లిపేరుతో మోసం.. మహాభారతం సీరియల్‌లో భీముడు అరెస్టు!

దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన మహాభారతం సీరియల్‌లో భీముడి పాత్రలో నటించిన యాక్టర్, రెజ్లర్ సౌరవ్ గుజ్జర్‌ను హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లిపేరుతో మోసం చేశాడని, లైంగికంగా వాడుకుని వదిలేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సౌరవ్ గుజ్జర్ బాలీవుడ్ బుల్లితెరలో నటించడంతో పాటు సినిమాల్లోనూ పలు విలన్ పాత్రలు పోషించాడు. దీనికి తోడు అమెరికాలో నిర్వహించే రెజ్లింగ్ క్రీడల్లోనూ పార్టిసిపేట్ చేసి సత్తా చాటాడు. వివరాల్లోకివెళితే.. 2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన గుజ్జర్.. అనంతరం వాట్సాప్ వేదికగా సన్నిహితంగా మెలిగాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. 2021 డిసెంబర్ 25న తొలిసారి కలిశామని, భార్యతో సమాన హక్కులు కల్పిస్తానని హామీ ఇచ్చాడంటూ యువతి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనకు సన్నిహితంగా ఉంటూ దగ్గరయ్యాడని, తీరా పెళ్లి పేరు ఎత్తితే పట్టించుకోవడం లేదని బాధితురాలు ఫిర్యాదు చేసింది.