క్రైమ్
ఆదిలాబాద్ రిమ్స్‌లో పట్టపగలే చోరీ.. రూ.30లక్షల విలువైన వెంటిలేటర్లు అపహరణ
RIMS: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ లో చోరీ జరిగింది. పట్టపగలే దుండగులు బరితెగించారు. వెంటిలేటర్లు ఎత్తుకెళ్లారు. రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే 4 వెంటిలేటర్స్ ను ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ వెంటిటేర్ల విలువ 30లక్షల రూపాయలు ఉంటుంది. గత నెల 30న రిమ్స్ రెండో అంతస్తులోని RICU విభాగంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు నాలుగు వెంటిలేటర్స్ ని సంచిలో పెట్టుకొని దర్జాగా తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై రిమ్స్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
