తెలంగాణ

గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం.. భయాందోళనలో స్థానికులు!

 హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో కలకలం నెలకొంది. నిర్మాణంలో ఉన్న ఒక నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కేవలం 50గజాల చిన్న విస్తీర్ణంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. భవనం పిల్లర్లు కుంగిపోయి, పక్కనే ఉన్న ఇతర ఇళ్లపైకి ఒరిగిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయంతో బయటకు పరుగులు తీశారు.