సినిమా

పవన్ జాతకంలో నాలుగు పెళ్లిళ్లు.. వేణుస్వామి జోస్యం నిజం కానుందా?

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన వివాహ బంధానికి ముగింపు పలికారు. తన మూడో భార్య అన్నా లెజినోవాతో 13 సంవత్సరాల వివాహా బంధానికి పరస్పర అంగీకారంతో ఎండ్ కార్డ్ వేశారు.ఇకమీదట ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌గా ఉంటామని, బాధ్యతాయుతంగా పిల్లల బాగోగులు చూసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయం అటు జనసైనికులను,పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా ఆరాధించే అభిమానులకు తేరుకోకుండా చేసింది.