క్రైమ్

ఫ్రిడ్జి పేలి నలుగురు సజీవదహనం

మనం ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన మరొకటి చోటుచేసుకుంది. ఏ వస్తువు అయినా వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రాణాలకే ముప్పు పొంచి ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఇంట్లో ఫ్రిడ్జి పేలిన ఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెళగావిలోని చమౌలి గల్లీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. బెళగావికి చెందిన రాజారాం కుటుంబ సభ్యులు ఇటీవల ఓ కొత్త ఫ్రిడ్జ్ కొనుగోలు చేశారు. సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు భారీ శబ్దంతో పేలింది. ఇంట్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇల్లు మొత్తం వ్యాపించడంతో శారద డమోలి (50), ఆమె కుమార్తెలు ప్రియా(28), గంగ(25)తో సహా మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు.