వైరల్ న్యూస్
రాత్రికి రాత్రే వరించిన అదృష్టం.. రూ.7లక్కీ టికెట్‌తో కోటీశ్వరురాలైన కూలీ భార్య!
అదృష్టం ఎవరిని, ఎప్పుడు, ఎలా వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. పంజాబ్‌కు చెందిన ఓ నిరుపేద దినసరి కూలీ భార్య జీవితాన్ని కేవలం రూ.7లక్కీ డిప్ టికెట్ పూర్తిగా మార్చివేసింది. పిల్లల కోసం దుస్తులు కొనేందుకు బజారుకు వెళ్లిన ఆమె, మార్గమధ్యంలో సరదాగా కొన్న లాటరీ టికెట్‌తో ఏకంగా రూ.కోటి జాక్‌పాట్ గెలుచుకున్నారు. పంజాబ్‌లోని కోట్‌కపురా (Kotkapura) ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. కోట్‌కపురా ప్రాంతానికి చెందిన బిమ్లా దేవి భర్త రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
