చిత్రం లేదు
తెలంగాణ

TG: జనంలోకి మాజీ మావోయిస్టులు.. ప్రజా పోరాటాల్లో ‘జన తెలంగాణ’!

TG: తెలంగాణ ఉద్యమ ఆశలు, ఏళ్ల తరబడి సాగిన ప్రజాపోరాటాల ఆలోచనలే పునాదిగా రాష్ట్ర రాజకీయాల్లోకి సరికొత్త గొంతు రాబోతోంది. దాదాపు యాభై ఏళ్ల పాటు విప్లవ బాటలో నడిచి, ఆ తర్వాత సాధారణ జీవితంలోకి వచ్చిన మాజీ మావోయిస్టులే కీలకంగా నిలబడి ‘జన తెలంగాణ పార్టీ’ పేరిట ప్రజల్లోకి అడుగుపెడుతున్నారు. తుపాకీ వదిలేసి ప్రజాస్వామ్య దారిని ఎంచుకున్న వీరు, ఇప్పుడు నేరుగా జనం సమస్యలపై మైదానంలోకి దిగి కొట్లాడటానికి నడుం కట్టారు.ఈ కొత్త ప్రయాణంలో విప్లవోద్యమాల్లో పనిచేసిన సీనియర్లు లంకా పాపిరెడ్డి (లచ్చన్న), న్యాయవాది బల్ల రవీంద్రనాథ్, గురిజాల రవీందర్‌రావు ముందంజలో ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యుదయవాదులు, ప్రజాహక్కుల కోసం పనిచేసే కార్యకర్తలు చేయి కలిపారు. అయితే, ఆపరేషన్ కగార్ తర్వాత బయటకొచ్చిన దేవ్‌జీ-సంగ్రామ్ వర్గం గానీ, సోనూ-ఆశన్న వర్గం గానీ ఈ పార్టీలో చేరడం లేదని స్పష్టమైంది.