సీఈసీ నియామకంపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
దేశం, ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు.ఓటు చోరీ, ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని విపక్షాల ఆరోపణలు, దీంతో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, సీజేపీ పార్టీలు డిమాండ్ చేస్తున్న వేళ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఈసీ రాజీనామా అంశంలో నేరుగా స్పందించకుండానే ఆయన నియామకాన్ని తప్పుబట్టారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ నియామకాన్ని అధికార పార్టీలు చేపట్టకూడదని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఈసీ నియామకం న్యూట్రల్ బాడీస్ ద్వారా జరగాలని ఆకాంక్షించారు. గతంలో ఆ ప్రతిపాదనకు అంగీకరించి తప్పు చేశామని, అందుకే మార్పు రావాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు.సీఈసీ నియామకంలో సంస్కరణలు రావాలని, మళ్లీ న్యూట్రల్ బాడీ ద్వారా సీఈసీ నియామకం జరగాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
