తెలంగాణ

పెద్ది ‘గద్దె’ను కూల్చడం దుర్మార్గం..ముమ్మాటికీ కాంగ్రెస్ కుట్రే : ఎర్రబెల్లి

దివంగత నేత, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన ‘గద్దె’ను రాత్రికి రాత్రే కూల్చేశారు. నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహా ఏర్పాటుకు బీఆర్ఎస్ నేతలు సంకల్పించగా.. అనుమతి లేదంటూ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా అనుమతి లేదంటూ రాత్రి వేళ అక్రమంగా అధికారులు కూల్చేయడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.