National
వెళ్లిపోతున్న ఫారెన్ ఇన్వెస్టర్లు.. ఇండియా ఎకానమీపై నమ్మకం పోయిందా?
Economy Analysis: భారత స్టాక్ మార్కెట్లలో మొన్నటిదాకా నిధుల వర్షం కురిపించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ గేర్ వేశారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ దేశీయ మార్కెట్ల నుంచి తట్టాబుట్టా సర్దుకుని పారిపోతున్నారు. భారత వృద్ధి రేటు ప్రపంచానికే ఆదర్శమంటూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు కితాబులిస్తున్న వేళ.. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్లు ఎందుకు భారత్‌పై నమ్మకం కోల్పోయి విక్రయాల సునామీ సృష్టిస్తున్నారు? కేవలం మధ్యప్రాచ్య యుద్ధాలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదలే దీనికి కారణమా? లేక కాగితాలపై కనిపిస్తున్న భారత వృద్ధి గణాంకాల వెనుక దాగిన లోపాలను వాళ్లు ముందే పసిగట్టారా? అసలేమైంది..
