తెలంగాణ

స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. పుల్లారెడ్డి స్వీట్ షాప్‌తో పలు షాపుల లైసెన్స్ రద్దు!

దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ హైదరాబాద్‌లో పలు ప్రముఖ స్వీట్ షాపులు, ఆహార తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అత్యంత ఆదరణ పొందిన 'పుల్లారెడ్డి స్వీట్స్' (G. Pulla Reddy Sweets) సహా పలు షాపుల్లో తనిఖీలు చేసి అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్నట్లు ఆధారాలతో సహా నిరూపితం కావడంతో పుల్లారెడ్డి స్వీట్స్‌కు చెందిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్‌ను అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు.