తెలంగాణ
రేవంత్ సొంతజిల్లాలో ఫుడ్ పాయిజన్.. బుద్ధితెచ్చుకోని సర్కార్!
రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కలుషిత ఆహారం తిని సాంఘీక సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.ఫుడ్ పాయిజన్తో పలువురు విద్యార్థులు మరణించిన ఘటనలు కూడా రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి.అయినప్పటికీ సర్కార్ తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో ఫుడ్ పాయిజన్ జరిగింది.ఈ ఘటనలో 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.నొప్పి తట్టుకోలేక విద్యార్థినులు కంటతడి పెట్టుకుని విలవిల్లాడారు.బుధవారం రాత్రి ఘటన జరిగితే వీడియోలు బైటికి రాకుండా అధికార పార్టీ నేతలు తొక్కి పెట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం.
