International

86 వాహనాలు ఢీ.. 12 మందిని బలిగొన్న పొగమంచు!

బల్గేరియా దేశ రాజధాని సోఫియాను బుర్గాస్ ఓడరేవుతో కలిపే రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో యాంబోల్ సమీపంలో ఈ వాహనాలు ఢీకొన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.ఈ ఘటనలో 86 వాహనాలు ఒకదానికొకటి ఢీకొనగా 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం వల్లే ఇరువైపులా ఒకే ప్రదేశంలో ఒకదాంతో మరొకటి 86 వాహనాలు ఢీకొట్టుకున్నట్టు తెలిసింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టాయి. ఈ ప్రమాదంలో మరో 46 మంది గాయపడగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది