International

Fly dubai: దుబాయ్ విమానం హైజాక్ అయిందా? 17వేల అడుగులు కింద‌కు ఎందుకు వ‌చ్చింది? అస‌లు కార‌ణం ఇదే!!

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన 'ఫ్లై దుబాయ్' (FZ1073) విమానంలో బుధవారం ఆకాశంలో అనూహ్య, ప‌రిణామం చోటుచేసుకుంది. సుమారు 33,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ గొడవలో విమానం హఠాత్తుగా కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 17,000 అడుగుల కిందకు పడిపోవడంతో పాటు విమానం నుంచి అత్యవసర సంకేతాలు వెలువడటంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. పరిస్థితి చేయిదాటడంతో విమానం నుంచి మొదట సాధారణ అత్యవసర సంకేతం (Code 7700), ఆ తర్వాతి సెకన్లలోనే హైజాకింగ్ లేదా అక్రమ జోక్యాన్ని సూచించే సంకేతం (Code 7500) పంపబడింది.