Flydubai: విమానాన్ని నడిపిన ప్లంబర్.. పైలట్ స్మిత్ ఏమన్నారంటే?
Flydubai: ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన భయానక ఘటన తర్వాత ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా తెగ చక్కర్లు కొట్టింది. విమానం గాల్లో ఉండగానే పైలట్ల మధ్య దాడి జరిగి అదుపుతప్పితే, ఓ ప్యాసింజర్ అయిన ప్లంబర్ కాక్‌పిట్‌లోకి దూరి టీవీ షో గుర్తొచ్చి విమానాన్ని కంట్రోల్ చేశాడని, అలా అందరి ప్రాణాలు కాపాడాడంటూ ఒక కథ విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. తాజాగా ఈ ప్రచారంపై నాడు కాక్‌పిట్‌లో ప్రాణాలతో పోరాడిన ఇండియన్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ స్పందించారు. యూఏఈలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న స్మిత్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు. "నిజం చెప్పాలంటే ఆ ప్లంబర్ కథేంటో నాకైతే అస్సలు తెలియదు. నాపై ఒక్కసారిగా దాడి జరిగినప్పుడు విమానం కిందపడిపోకుండా ఆపడం, నన్ను నేను కాపాడుకోవడం మీదే నా శక్తినంతా పెట్టాను. ఒక ప్లంబర్ నిజంగానే విమానాన్ని ల్యాండ్ చేయగలడా లేదా అనే ఊహాగానాల జోలికి నేను వెళ్లదల్చుకోలేదు" అని స్పష్టం చేశారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఒక సీనియర్ అధికారి 'విమానం కెప్టెన్ కంట్రోల్లోనే ఉంది' అని చెప్పడం మాత్రమే తనకు గుర్తుందన్నారు.
