ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అప్పటి నుంచే..!
Flipkart : ఆన్లైన్ షాపింగ్ ప్రియులు ఏడాదంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే అతిపెద్ద పండుగ రానే వస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తీసుకొచ్చే 'బిగ్ బిలియన్ డేస్' సేల్ కోసం దేశవ్యాప్తంగా కోట్ల మంది వేచి చూస్తుంటారు. అయితే, కంపెనీ అధికారికంగా ప్రకటించకముందే ఈ మెగా సేల్ ఎప్పుడు మొదలవుతుందనే పక్కా సమాచారం నెట్టింట లీకై సంచలనం సృష్టిస్తోంది.సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ లీక్ కలకలం రేపుతున్నప్పటికీ, దీనిపై ఫ్లిప్కార్ట్ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు. సంస్థ అంతర్గత ప్రణాళికలను బట్టి తేదీల్లో స్వల్ప మార్పులు చేర్పులు ఉండే అవకాశమూ లేకపోలేదు. పూర్తి షెడ్యూల్, బ్రాండ్ల వారీ ఆఫర్ల వివరాలు బయటకు రావాలంటే కంపెనీ లాంఛనంగా ప్రటించే వరకు వేచి చూడాల్సిందే. అయితేనేం, షాపింగ్ లిస్ట్ రెడీ చేసుకునేందుకు ఈ లీక్ అయిన సమాచారం కొనుగోలుదారులకు మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి.
