తెలంగాణ
Flight Ticket Prices : ఫ్లైట్ టికెట్ ధరలకు రెక్కలు.. పండుగ సీజన్లో 300% వరకు పెంపు!
దేశంలో వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, దుర్గాపూజ వంటి ఫెస్టివల్స్ రానుండటంతో విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు ముందుగానే బుకింగ్స్ చేసుకుంటుండటంతో పలు దేశీయ మార్గాల్లో టికెట్ ధరలు గణనీయంగా పెరిగాయి. సీట్లు తక్కువగా దొరకడం, పరిమిత విమానాలు, డైనమిక్ ప్రైసింగ్ కారణంగా కొన్ని రూట్లలో సాధారణ ఛార్జీలతో పోలిస్తే 50 నుంచి 150 శాతానికి పైగా రేట్లు పెరిగినట్లు తాజా ట్రావెల్ మార్కెట్ రికార్డ్‌లు సూచిస్తున్నాయి. ఈ దీపావళి సమయంలో ఢిల్లీ–పాట్నా రూట్లో నార్మల్‌గా రూ.3,500–4,500గా ఉండే నాన్‌స్టాప్ ఎకానమీ టికెట్ ధర రూ.12,500 దాటింది. చివరి నిమిషంలో బుకింగ్ చేస్తే రూ.13,500కుపైగా చెల్లించాల్సి వస్తోంది.
