International
Flash flood Nepal: మానవాళి మనుగడకు ముప్పుగా మారుతున్న ప్రకృతి..నేపాల్లో మళ్లీ వరదలు!!..
నేపాల్ గోర్ఖా జిల్లాలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. బుధిగండకి నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తి 35కి పైగా ఇళ్లు, పలు వంతెనలు కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన అధికారులు నదీ పరివాహక ప్రాంత ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు.
