వైరల్ న్యూస్
ఐదుగురు పిల్లలు.. ప్రియుడితో భార్యను పంపించేసిన భర్త (వైరల్)
ఓ భర్త తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఆమె మరల ప్రేమించిన తన ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్లో జరిగింది. 21 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంటకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. రెండు నెలల క్రితం కబీర్ నగర్‌కు చెందిన తనకంటే వయసులో 13 ఏళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ప్రేమలో పడింది. అతనితో కలిసి వెళ్లిపోయింది. మరల ఆమె తిరిగి రావడంతో దంపతుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. తను వెళ్లిపోయిన యువకుడితో ఉంటానని భార్య మొండికేయడంతో గ్రామపెద్దల సమక్షంలో ఆ యువకుడికి తన భార్యనిచ్చి అధికారికంగా పెళ్లి జరిపించాడు.
