తెలంగాణ

Fishermen Insurance: రూ.5లక్షలు.. మత్స్యకారులకు ప్రభుత్వం శుభవార్త.. ప్రమాద బీమా పథకం

తెలంగాణలోని మత్స్యకారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ గ్రూప్ ప్రమాద బీమా పథకం తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ ప్రమాద బీమా స్కీమ్ అమలు చేయనున్నట్లు వివరించారు.

చేపల వేటకు వెళ్లిన సమయంలో లేదా ప్రమాదవశాత్తు మరణించినా, పూర్తి వైకల్యానికి గురైనా ఆ కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం లభిస్తుంది. ప్రమాదాల వల్ల పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ.2.50 లక్షల వరకు పరిహారం అందుతుంది. ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.25వేల వరకు అందిస్తారు.