ఏపీ
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఫిక్స్!
ప్రయాణికులకు అత్యంత విలాసవంతమైన, వేగవంతమైన ప్రయాణ అనుభూతిని పంచేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. దేశంలోనే రెండో వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈసారి ఈ అత్యాధునిక లగ్జరీ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా రాకపోకలు సాగించనుండటంతో ఏపీ ప్రజలకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) మధ్య ఈ వందే భారత్ స్లీపర్ సర్వీస్‌ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
