క్రైమ్

Fire Incident: ఘోర అగ్నిప్రమాదం.. 16 మంది కార్మికులు సజీవ దహనం

Fire Incident: సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 16 మంది చనిపోయారు. రియాద్ లోని ఓ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. మృతులంతా అక్కడ పని చేసే కార్మికులు. వారంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు. మంటల్లో వారంతా సజీవ దహనం అయ్యారు. కాగా, సౌదీలో దాదాపు 35 లక్షల మంది బంగ్లాదేశీయులు పని చేస్తున్నారు.