సికింద్రాబాద్లో బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్లోని బాణాసంచా దుకాణంలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రాకర్స్ షాపు ఉన్నట్టుండి మంటల్లో చిక్కుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. సికింద్రాబాద్ చిలకలగూడలోని డీబీఆర్ షోరూం పక్కనే ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే దుకాణం మొత్తం అగ్నికీలలు వ్యాపించాయి. మంటల ధాటికి భారీ శబ్దాలతో బాణసంచా మొత్తం పేలిపోయింది. పేలుళ్ల శబ్దాలతో పరిసర ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో బాణసంచా దుకాణంలోని క్రాకర్స్ పూర్తిగా కాలిపోయాయి.జనావాసాలు, రద్దీ ప్రాంతాల్లో క్రాకర్ షాపుల ఏర్పాటుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
