తెలంగాణ
6 నెలల్లోనే రేవంత్ రెడ్డి మార్క్ ఆర్థిక వినాశనం- దాసోజు శ్రవణ్ సంచలనం
Brs: కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా చేసిన అంకెల గారడీ మొత్తం కాగ్ (కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తాజా అర్ధవార్షిక నివేదికతో బట్టబయలైందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ తన అసమర్థ పాలనతో, అడ్డగోలు అప్పులతో ఖజానాను ఖాళీ చేసి, రాజ్యాంగబద్ధ ఆడిట్ సంస్థలకే తప్పుడు లెక్కలు చెబుతూ రాష్ట్రాన్ని దివాళా అంచున నిలబెట్టారని శ్రవణ్ మండిపడ్డారు.
