క్రీడలు
FIFA WC-2026: ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్.. మెస్సీ సేనకు షాక్!
ఫిఫా 2026 ఫైనల్ పోరులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. న్యూయార్క్ న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో అర్జెంటినాపై స్పెయిన్ విశ్వవిజేతగా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో స్పెయిన్ తన 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ (2010 తర్వాత) రెండోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. మరోవైపు, టైటిల్‌ను నిలబెట్టుకోవాలని, నాలుగోసారి కప్ గెలవాలని బరిలోకి దిగిన మెస్సీ సైన్యానికి రన్నరప్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు.
