తెలంగాణ

జనరల్ బోగీలకు కోత.. ఏసీ కోచ్‌ల మోత.. రైళ్లలో సామాన్యుడికి చోటేది?

 పండుగ పూట స్వగ్రామాలకు వెళ్లే పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు రైల్వే శాఖ నుంచి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం ధనికులకే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన రైలు ప్రయాణాన్ని సంపన్నులకే పరిమితం చేసేలా ప్రభుత్వ విధానాలు మారుతున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ బోగీల సంఖ్యను విపరీతంగా పెంచేస్తున్నారు. ఆదాయమే ధ్యేయంగా సాగుతున్న ఈ తీరు వల్ల సాధారణ ప్రయాణికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.