తెలంగాణ
రెస్ట్ రూంలో విద్యార్థిని చితకబాదిన తోటి స్టూడెంట్స్.. ఎందుకంటే?
ఉప్పల్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్టు సమాచారం. బాత్రూంలోకి తీసుకెళ్లి మరి దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. నాగోల్‌కు చెందిన భువన్ మోహిత్.. ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో బీబీఏ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.ఈ నెల 3న అదే కాలేజీకి చెందిన తోటి విద్యార్థులు ఛత్రీస్, యశ్వంత్, వినయ్ అతడిని మాట్లాడుకుందామని రెస్టు రూంకు తీసుకెళ్లినట్టు సమాచారం. అక్కడ యశ్వంత్, వినయ్‌లు భువన్ మోహిత్‌ను గట్టిగా అదిమి పట్టుకోగా.. ఛత్రీస్ అతనిపై దాడి చేసి గాయపరిచినట్టు బాధితుడు ఆరోపించారు. అంతేకాకుండా భువన్.. మొబైల్‌ను సైతం గుంజుకుని కిందకు విసిరేయడంతో ఫోన్ పగిలిపోయినట్టు తెలుస్తోంది.
