National

FCRA: విదేశాల నుంచి వచ్చే డబ్బుపై ఇక మరింత నిఘా? FCRA బిల్లుతో అసలు ఏం మారబోతోంది?

ఒక సంస్థకు విదేశాల నుంచి డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో స్కూల్ నడిపించారు. మరో సంస్థ ఆసుపత్రి నిర్వహించింది. ఇంకొక సంస్థ పేదలకు సేవలు చేసింది. మరికొన్ని సంస్థలు సామాజిక కార్యక్రమాలు చేపట్టాయి. కానీ ఇకపై ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఎక్కడ ఖర్చు చేశారు? ఆ సంస్థకు విదేశీ నిధులు తీసుకునే అర్హత ఉందా? అనే ప్రశ్నలపై కేంద్రం మరింత కఠినంగా దృష్టి పెట్ట‌బోతోంది. ఇందుకు కారణం.. ఫారిన్ కంట్రిబ్యూష‌న్ రెగ్యులేష‌న్ అమెండ్‌మెంట్ బిల్-2026.

FCRA సవరణ బిల్లు కొన్ని బిల్లుల్లా సాధార‌ణ బిల్లు కాదు. దేశంలోకి వచ్చే విదేశీ నిధులు, వాటి వినియోగం, ఎన్జీవోల స్వేచ్ఛ, ప్రభుత్వ నియంత్రణ, జాతీయ ప్రయోజనం.. ఈ ఐదు అంశాల మధ్య జరగబోయే పెద్ద చర్చకు ఇది నాంది.