ఏపీ
FBI పేరిట ‘ఎక్స్’ను మస్కా కొట్టించిన ఏపీ పోలీసులు.. చివరకు!
ప్రభుత్వాలు సరిగా పని చేయకుంటే నేరుగా స్పందించని కొందరు ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను తమ సోషల్ మీడియా వాల్ మీద రాసుకొస్తున్నారు. మరికొందరు అసహనం ఎక్కువై దూషణలు సైతం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు వారి మీద కఠినచర్యలు తీసుకుంటున్నాయి. ఒక వ్యక్తి చేసిన పోస్టును హైడ్ చేయడం అనేది అతని చేతిలోనే ఉంటుంది. లేదా రిమూవ్ చేసే అధికారం సదరు సోషల్ మీడియా సంస్థకు ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోస్టులను రిమూవ్ చేయాలని లేదా హైడ్ చేయాలని ఇటీవలి కాలంలో సైబర్ పోలీసులు సదరు సోషల్ మీడియా సంస్థలకు రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ పోలీసులు ‘ఎక్స్’సంస్థకు FBI పేరిట ఒక మెయిల్ పెట్టారు. పోస్టులు తొలగించాలని అందులో కోరగా.. ఎక్స్ ఈ విషయాన్ని పసిగట్టి విషయాన్ని బయటపెట్టింది.
