తెలంగాణ

ఎండుతున్న పంటలు.. మంచిర్యాలలో సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

Farmers Protest: తెలంగాణలో సాగునీటి కష్టాలు పెరుగుతున్నాయి. సాగునీటి కోసం అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికి అందివచ్చిన పంట.. నీరు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కారు. జన్నారం మండలం తపాలాపూర్ అటవీ చెక్ పోస్ట్ సమీపంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాంపూర్, తపాలాపూర్, తిమ్మాపూర్, తాలపేట రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు ధర్నా చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.