టాప్ న్యూస్

రైతు బీమా బంద్..అన్నదాత ఆగం?

అన్నదాత మరణిస్తే బాధిత కుటుంబానికి భరోసాగా గత ప్రభుత్వం చెల్లించిన రెతు బీమా రూ.5 లక్షలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలిచిపోయినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో రైతు భరోసా, రైతుభీమా కొనసాగిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే రైతు బీమా నిలిపి వేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎనిమిదేళ్లుగా అన్నదాత కుటుంబాలకు అండగా నిలిచిన రూ.5 లక్షల భరోసాను తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసినట్టు తెలిసింది.నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల దళిత రైతు ఒర్సు రాంచందర్ గత నెల 29న గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు అర ఎకరం భూమి, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబపెద్ద మరణంతో రాంచందర్ మిత్రులు రూ.5 లక్షల రైతుబీమా కోసం స్థానిక ఏఈఓను కలవగా.. రైతుబీమా పథకం ఆగస్టు 14 నుంచి నిలిచిపోయిందని, బీమా క్లెయిమ్ కాదని చెప్పడంతో రాంచందర్ కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయినట్టు సమాచారం.