అన్నదాతల కష్టం ఆవిరి.. పొలాల్లోకి ఏనుగుల గుంపు!
ఓ వైపు వర్షాలు లేక పంటలు పండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఎలాగైనా శ్రమించి దేశానికి అన్నం పెట్టాలని భావించిన రైతుల కష్టాన్ని ఏనుగులు నీళ్ల పాలు చేశాయి. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో ఈసారి చాలా మేరకు వరి సాగుకు అన్నదాతలు ముందుకు రాలేదు.పంటమార్పిడి విధానం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు అధికారులు అన్నదాతలకు కీలక సూచనలు చేశారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేసినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వరి నాట్లు వేయగా.. అనుకోకుండా ఏనుగుల గుంపు పొలాల్లోకి వచ్చింది.అంతటితో ఆగకుండా నాట్లు మొత్తం తొక్కేశాయి. సుమారు 8 ఏనుగులు పొలాల్లోకి రావడంతో అన్నదాతలు పరుగులు తీశారు. తమ పంట పొలాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గుమడ–కోటిపాం పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకుంది.
