తెలంగాణ

తెలంగాణలో వాటర్ వార్స్ షురూ.. సాగునీటి కోసం రెండు గ్రామాల రైతుల మధ్య ఘర్షణ

Water Fight: వనపర్తి జిల్లాలో సాగునీటి కోసం రెండు గ్రామాల రైతుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. పానగల్ మండలంలో మహమ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల రైతులు బీమా కాలువ నీటి పంపిణీ విషయంలో గొడవపడ్డారు.

పానగల్ మండలం మహమ్మదాపూర్ లో బీమా కాలువ కెనాల్ షట్టర్ మూసివేత వివాదానికి దారితీసింది. దీంతో 5 గ్రామాల పొలాలకు సాగునీరు నిలిచిపోయింది. ఆయా గ్రామాల రైతులు కెనాల్ షట్టర్ తెరవడంతో ఇరువర్గాల రైతుల మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో మహమ్మదాపూర్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.